ప్రభుత్వ ఉద్యోగుల పాలిట దైవంగా జగనన్న ప్రభుత్వం!

-

నిన్నటితో ముగిసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నిముఖ్యమైన బిల్లులను తీసుకువచ్చింది. ఈ బిల్లులు ఎంత ముఖ్యమైనవి అంటే… వీటి ద్వారా లబ్ది చెందే వారి కళ్ళలో చూస్తే ఆ సంతోషం మరియు తృప్తి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల మేలు గురించి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించిన తీరు హర్షణీయం.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా వారిని తమ తోటి కుటుంబ సభ్యులుగా భావించి, వారి సంక్షేమమే ప్రభుత్వ సంతోషం అని భావించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ప్రభుత్వం.

కాగా శాసనసభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు అంటే నెల జీతానికి పనిచేసే కార్మికులు కాదు, వీరు ప్రభుత్వంతో ముప్పై సంవత్సరాల పాటు కలిసి మెలసి ఉంటారు. వీరికి ఎటువంటి కష్టం, నష్టం కలిగినా చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే. తమ ఉద్యోగ సమయం అంతా ప్రజల కోసమే పనిచేసి తీరా తమ పదవీకాలం ముగిశాక ఎంతో నిరాశతో, బాధతో వెళుతూ ఉంటారు. కానీ అలంటి వారు ఇక బాధపడాల్సిన అవసరం లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉండనుంది. ప్రభుత్వం కోసం రాష్ట్రము కోసం ఎంతో కష్టపడి పనిచేసిన ఇలాంటి ఉద్యోగులను ఊరికే వదిలి వేసేంత స్వార్ధ ప్రభుత్వం మాది కాదు అంటూ బుగ్గన వారికి భరోసాను కల్పించారు. గతంలో చాలా ప్రభుత్వాలు ఉద్యోగుల చేత నానా చాకిరీలు చేయించుకుని గాలికి వదిలేసిన ఘటనలు లేకపోలేదు. ప్రభుత్వం కోసం ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా భాగం అయిన అందరి కుటుంబాల్లో వీరు రిటైర్ అయ్యాక కూడా నవ్వులు పూయించాలని జగన్ ప్రభుత్వం ఒక గట్టి సంకల్పానికి నడుం బిగించింది. ఈ ఉద్యోగులు రిటైర్ అయ్యాక కూడా వారికీ మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సైతం ఆరోగ్య భీమాను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా వీరికి నెల నెలా ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ ను ప్రణాళిక ప్రకారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియచేసింది.

ఇది మాత్రమే కాకుండా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏమేమి చేసిందో కూడా సభాముఖంగా వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వారు మా జాబ్ లు పర్మినెంట్ అవుతాయా? లేదా ఊడిపోతాయా అన్న బాధలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం వారిని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసింది. ఇంకా ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వేల కొద్దీ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మన ప్రభుత్వానిది. గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను సైతం పెంచిన మంచి మనసున్న ప్రభుత్వం అని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలియచేశారు. ఇటువంటి ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు సంతోషంగా ఉండడానికి కారణమయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ బుగ్గన గొప్పగా చెప్పుకున్నారు.

ప్రభుత్వం ఉద్యోగాల కోసం కొత్తగా తెచ్చిన జిపిఎస్ బిల్లు గురించి కూడా బుగ్గన వివరించారు. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లుకు శాసనసభ ఆమోదాన్ని తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి 2014 , జూన్ 2వ తేదీ కన్నా ముందు పదవిలోకి వచ్చి ఈ రోజు వరకు వివిధ ప్రభుత్వ శాఖలలో విధులను నిర్వర్తిస్తున్న 11633 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ ఎంప్లాయిస్ గా గుర్తించాలన్న బిల్లుకు ఆమోదం తెలపడంతో వీరి కుటుంబాలలో చెప్పలేని సంతోషం అలుముకుంది. అంతే కాకుండా ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీం బిల్లుకు సైతం మంత్రి మండలిలో ఆమోదాన్ని ఇచ్చింది.

ఈ బిల్లు ద్వారా చేకూరనున్న ప్రయోజనాలను ఒకసారి చూస్తే..

1. గ్యారెంటీగా పెన్షన్
2. కుటుంబానికి భద్రత
3. ఆరోగ్యభద్రత
4. జీవిత బీమా
5. మినిమం పెన్షన్

ఇవి మాత్రమే కాకుండా ఒక ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి కనీసం సొంత ఇంటి స్థలం లేకపోతే, కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. మరియు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు, మరియు వారి పిల్లలకు ఆరోగ్య శ్రీ పధకం అమలు అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు తెలియచేసింది. ఇక ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ అమలు అయ్యీలా చూసుకోవాలని జగన్ సూచినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news