కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదు..సిగ్గులేకుండా ఆలింగనం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా పాదయాత్ర చేస్తోందని..కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన సభలో ఎన్నడూ కలవని వారిలా ఆలింగనాలు చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు.
నిన్నటి సభలో సిగ్గు లేకుండా మేమంతా కలిసి ఉన్నామనే సంకేతం ఇచ్చారని.. నిన్నటి కార్యక్రమంలో ఎవరి గుంపులు వారివే… వారెక్కడ కలిసినట్టు అని ఎద్దేవా చేశారు. నిన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం లేకుండా సందర్భంలేని సమయంలో స్థిరత్వం లేకుండా నన్ను విమర్శించారని.. ఈర్ష్య, భయంతో చరిత్రను మర్చి పోయిన ఆయనను నల్లగొండలో మా మిత్రుడు భూపాల్ రెడ్డి ఓడించలేదా అని ప్రశ్నించారు. ఉదయం బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానని మధ్యాహ్నం కాంగ్రెస్, సాయంత్రం బీజేపీ అమిత్ షాతో మాట్లాడుతున్నారు… ఐదేకరాల భూమి ఉందన్న కోమటిరెడ్డికి హైదరాబాద్ లో విల్లాలు, ఇతర ఆస్తులు ఎక్కడివి అని ఆగ్రహించారు. జిల్లాలో రెండు పంటలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ ది…సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విదంగా 65వేల కోట్ల రైతు బంధు, అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.