మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినా కానీ మన ఇంట్లో కానీ గడప మీద కాలు పెట్టకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. గడప మీద కాలు వేయకూడదని తొక్కితే మహా పాపం అని కూడా అంటారు. అయితే నిజంగా గడప మీద కాలు వేయడం తప్పా..? దాని వలన మనకు ఏమైనా సమస్యలు కలుగుతాయా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం..
పూర్వకాలం లో ప్రతి గదికి కూడా ఒక పెద్ద చెక్క గడప ఉండేది ఈ రోజుల్లో చాలా మంది గడపలని ఇంట్లో పెట్టుకోవడం లేదు. అన్ని గదులకు గడపలు కాకుండా ఇంటికి ఒకే ఒక్క గడప ఉంటోంది. అది కూడా ముఖద్వారం వద్దే ఉంటోంది. అయితే చాలా మంది ఆ గడపకి బొట్లు పెట్టి ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. శుక్రవారం నాడు కానీ ముఖ్యమైన పర్వదినాల్లో కానీ గడపలకి పూజ చేస్తూ ఉంటారు. పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటారు అయితే నిజానికి గడపలను తొక్క కూడదు.
గడపని తొక్కకుండా దాటి వెళ్లాలి. గడపని ల క్ష్మీదేవిగా భావించాలి గడపని తొక్కకుండా గడపని పూజిస్తే మన వెంట లక్ష్మీదేవి ఉంటుంది. దుష్టశక్తులు ఏమీ లేకుండా ఉంటాయి నర దిష్టి తగలకుండా ఉండాలంటే శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నల్లటి పటిక కడితే నరదిష్ఠి పోతుంది. లక్ష్మీదేవిగా భావించి గడపని పూజించాలి తప్ప తొక్కి పాపం చేయకూడదు కాబట్టి ఎప్పుడూ గడపని దాటే వెళ్లాలి. గడప మీద కాలు వేయకూడదు.