వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు శిష్యుడే..ఈ రేవంత్ రెడ్డి – హరీష్‌ రావు

-

వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు శిష్యుడే..ఈ రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ మంత్రి హరీష్‌ రావు సీరియస్‌ అయ్యారు. సిద్దిపేట రూరల్ (మం) రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ వాఖ్యలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు అనంతరం మాట్లాడారు.

వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అంటేనే ఒకప్పుడు కరెంట్ కోతలు అంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి తెలివి ఉందా లేదా అని అర్ధం కావడం లేదని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలూ ఆలోచించాలి 3గంటల కరెంటు కావాలా 24 గంటల కరెంటు కావాలా అని… కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతం…కాంగ్రెస్ అంటేనే చీకటి BRS అంటే వెలుతురు అని తెలిపారు. ఒకడు గల్లిలో మరొకడు ఢిల్లీ లో కూర్చుని మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇస్తున్నాం ఇలా ఎవరూ అయిన ఇచ్చారా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news