ఇండస్ట్రీని ఏలుతున్న మేనమామ – మేనల్లుళ్లు వీళ్లే..!

-

సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నప్పుడే వారు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తద్వారా స్టార్ హీరోలుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే హీరోల అక్కలు ,చెల్లెళ్ల వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో భాగంగానే మేనమామ మేనల్లుళ్ళు గా ఇండస్ట్రీలో దూసుకుపోతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న హీరోల జాబితా మన టాలీవుడ్ లో ఎక్కువగానే ఉందని చెప్పాలి. మరి వారెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

నాగార్జున – సుశాంత్, సుమంత్ :

నాగార్జున బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్ద సక్సెస్ సాధించాలని చూశారు సుశాంత్.. కానీ ఇప్పటికే హీరోగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అందుకే వేరే హీరోల సినిమాలలో సైడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక సుమంత్ కూడా హీరోగా సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు పెద్దగా వర్కౌట్ కాలేదు. గతంలో ఈయన నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ :

టాలీవుడ్ లో వీరిద్దరి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలసి తొలిసారి నటిస్తున్న సినిమా బ్రో ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కాబోతోంది.

వెంకటేష్ – నాగచైతన్య :
వెంకీ మామ సినిమాలో నాగచైతన్య తన మేనమామ వెంకటేష్ ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. అలా ఈ మేనమామ, మేనల్లుడు కూడా ఇండస్ట్రీలో తమదైన శైలిలో హీరో గా సత్తా చాటుతున్నారు.

చిరంజీవి – వైష్ణవ తేజ్ , సాయి ధరమ్ తేజ్ :
చిరంజీవి చెల్లెలి కొడుకులైన సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరు కూడా మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల బాటలోనే నడుస్తూ సక్సెస్ దిశగా దూసుకుపోతున్నారు.

మహేష్ బాబు – గల్లా జయదేవ్ , చరిత్ మానస్:

మహేష్ బాబు మేనల్లుడిగా హీరో టైటిల్ తో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు గల్లా జయదేవ్. ఇతడు సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క పద్మావతి కుమారుడు. ఇక మరొకరు చరిత్ మానస్.. ఇతడు కూడా మహేష్ బాబు మేనల్లుడే.. త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news