బిజెపి అచ్చేదిన్ అంటే గిట్లే ఉంటది – హరీష్ రావు

-

గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి, హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని మండిపడ్డారు.

డొమెస్టిక్ సిలిండర్ పై రూ. 50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమైన చర్య అన్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉండేదని, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారని అన్నారు. నాడు గ్యాస్ ధరలు 400 ఉంటే అప్పటి బిజెపి నేతలు గగ్గోలు పెట్టారని.. స్మృతి ఇరానీ గ్యాస్ బండతో రోడ్లమీద ధర్నా చేసిందని గుర్తు చేశారు.

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర లో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో మళ్లీ ధరలు పెంచారని అన్నారు. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయని.. అవి అయిపోగానే మళ్లీ పెంచుతారని ఆరోపించారు. బిజెపి అచ్చేదిన్ అంటే గిట్లే ఉంటది అన్నారు హరీష్ రావు. బిజెపి పాలనలో అచ్చేదిన్ కాదు.. ధరల పెరుగుదల చూసి సామాన్యుడు భయపడి రోజు చచ్చేదిన్ అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news