తెలంగాణలో ఏడేళ్లలో 7.6 శాతం పచ్చదనం పెరిగింది : మంత్రి హరీశ్ రావు

-

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని హైదరాబాద్‌లో 12వ గ్రాండ్ నర్సరీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పీవీ నరసింహారావు మార్గ్ – నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ మేళాను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు లక్ష్యంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని మంత్రి అన్నారు.

తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో అఖిల భారత ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి పలు‌ కంపెనీలు, అంకుర సంస్థలు, నర్సరీలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బొన్సాయ్ మొక్కల అందాలు చూసి పరవశించిపోయారు. మొక్కలు మనకు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని తెలిపారు.

పట్టణ, నగర ప్రాంతాల్లో టెర్రస్, కిచెన్, ఆర్టికల్ గార్డెనింగ్ చేసుకుంటే ఆర్గానిక్ కూరగాయలు పొందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలలని రాష్ట్రంలో 12,751 గ్రామాల్లో ప్రభుత్వం పల్లె, ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామ పంచాయతీల్లో వనాలకు ప్రత్యేక స్థలం కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news