రైతుకు వెంటనే ఎకరానికి రూ. 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతుల కష్టాలు విన్న మాజీ మంత్రి హరీశ్ రావు…రైతుల బాధలను చూస్తుంటే గుండె కదిలిపోతోందని పేర్కొన్నారు. రైతుకు వెంటనే ఎకరానికి 25 వేల నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతాబాయి తండాలో పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గేట్లు తెరవాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. రైతు కోసం గేట్లు తెరువు. సీఎం, మంత్రులు హైదరాబాద్‌లో రాజకీయాలు మాని వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి రైతులకు ఆత్మవిశ్వాసం కల్పించండని కోరారు. ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి వాళ్లింటికి వెళ్తున్నాడని ఫైర్ అయ్యారు.