దళితులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నియోజకవర్గానికి వంద మందికి దళిత బంధు అమలు చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. నిన్న మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా దళిత బందుపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని చెప్పారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దళితబందు పథకం ప్రవేశపెట్టారని చెప్పారు హరీష్ రావు.
మార్చి నుంచి నియోజకవర్గంలోని 2 వేల మంది దళితులకు దళిత బంధు పథకమన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి వందమందికి దళితబందు అమలు చేస్తామన్నారు. ఏ పైరవి లేకుండా అర్హులైన వారందరికీ దళిత బంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు దళితులను పూర్తిగా విస్మరించాయని వెల్లడించారు. దళిత బంధు ద్వారా ఇచ్చే రూ 10 లక్షలు వృధా చేయొద్దని చెప్పారు.