జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారు: హరీశ్‌రావు

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. గ్రూప్ – మెయిన్స్​ వ్యవహారంలో రాష్ట్ర సర్కార్​పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యాలయానికి గ్రూప్స్‌ అభ్యర్థులు వచ్చి వినతిపత్రం ఇచ్చారని హరీశ్ రావు తెలిపారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున తీయాలని అభ్యర్థులు కోరుతున్నారని చెప్పారు. తెలంగాణ భవన్​లో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు.

విపక్షంలో ఉన్నప్పుడు 1:100 చొప్పున తీయాలని యువతను రెచ్చగొట్టారన్న హరీశ్‌రావు.. ఇప్పుడు ఎందుకు గ్రూప్స్‌ మెయిన్స్‌కు 1:100 తీయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్స్‌ పోస్టులు పెంచాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగారని.. ఇప్పుడు పోస్టులు పెంచాలని అభ్యర్థులు కోరితే స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు.. ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మెగా డీఎస్సీ కింద 25 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. 11 వేల పోస్టులతో సరిపెట్టారని చెప్పారు. హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెప్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news