BREAKING: జగన్‌ కు మరో షాక్‌.. పోలీసులకు ఫిర్యాదు !

-

BREAKING: జగన్‌ కు మరో షాక్‌.. మాజీ సీఎం, YCP అధినేత జగన్‌‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం పేరుతో తన సొంత ఇంటికి రూ.46 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కింద జగన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

మరోవైపు క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ వినియోగించడం పట్ల రచ్చ సాగుతోంది. అటు రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు హత్య చేసినా సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news