సన్న బియ్యంలో 50 శాతం నూకలే… దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారు – హరీష్ రావు

-

రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంలో 40 నుంచి 50 శాతం నూకలు ఉంటున్నాయని… దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా పంపిణీ చేస్తున్నారని ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు… ఈ సందర్భ0గా మాట్లాడారు. రేషన్ విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు.

Harish Rao
Harish Rao

ఇచ్చిన మాట ప్రకారం, మంచి మంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి పంపిణీ చేసిన 3 నెలల కోటా సన్న బియ్యంలో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. రేషన్లు కార్డుల పంపిణీ కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ, ఏ ప్రభుత్వం ఉన్నా కొత్త కార్డులు ఇస్తూ ఉంటారు… బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు కేజీల బియ్యం కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news