బీఆర్ఎస్ వేడుకలను పాక్ స్వాతంత్ర్యంతో పోల్చడం రేవంత్ కుసంస్కారం : హరీశ్ రావు

-

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరిపితే పాకిస్థాన్ వేడుకలతో పోల్చడం కుసంస్కారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థం అవుతుందని అన్నారు. ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారికి, నోటి నుంచి ఒక్కసారి కూడా జైతెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడు నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు.

“ఒక్క రోజు ముందుగా జరపడం కాదు, ఏడాది పొడుగునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేలా మా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. 2023 జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. జూన్ రెండో తేదీన జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగించాం.” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news