ప్రభుత్వం ఏం చేస్తోంది.. దేశానికే ఆదర్శమైన గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ : హరీశ్ రావు

-

నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) లోని కేజీబీవీ పాఠశాలలో భోజనం వికటించి విద్యార్థినులు అస్వస్థతతకు గురయ్యారు. 11 మంది విద్యార్థినులు కడుపు నొప్పితో బాధపడటంతో  చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు బాలికలకు నొప్పి తీవ్రత మవడంతో నిర్మల్ జిల్లా  ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 15 రోజుల క్రితం ఇదే పాఠశాలలో భోజనం వికటించి 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వతతకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన ప్రశాంత్ ఉదంతాన్ని మరవక ముందే మరో ఫుడ్ పాయిజన్ ఉదంతం వెలుగులోకి వచ్చిందని అన్నారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం 11 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారని పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరికి ఈ ఉదంతాలు అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news