డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని మాట తప్పారు..ఎప్పుడు వేస్తారు : ఎమ్మెల్యే హరీశ్ రావు

-

డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని మాట తప్పారు..ఎప్పుడు వేస్తారు అని అసెంబ్లీ ఆవరణలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు. ప్రతిపక్షం లో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుంది. రైతులకు బోనస్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో చెప్పారు. బోనస్ కింది 5 వందల రూపాయలు ఇస్తాం అన్నారు.

వడ్లకు 5వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు చెప్పాలి అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు పెంచుతాం అన్నారు. రైతు బంధు కింద 15 వేల రూపాయలు ఇస్తాం డిసెంబర్ 9 న ఇస్తాం అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ఏమైంది అని ప్రశ్నించారు.  పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను అడుగుతున్నాం. దీనిపై ప్రభుత్వం స్పందిస్తే రైతులకు మేలు జరుగుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news