బ్రేకింగ్: కరోనా నుంచి కోలుకున్న హరీష్ రావు

-

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా నెగెటీవ్ గా నిర్ధారణ అయింది. ఈనెల 4 వ తేదీన కరోనా పరీక్షలో పాజిటీవ్ గా నిర్ధారణ కాగా హోం ఐసొలేషన్లో చికిత్స తీసుకుంటున్న హరీశ్… తాజాగా కరోనా నుంచి కోలుకున్న బయటపడ్డారు. ఆయనకు కరోనా పూర్తిగా నయమయ్యాక అసెంబ్లి సమావేశాలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో కరోనా పరీక్షల్లో  హరీష్ రావు కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికే తెలంగాణలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉంది. క్రమంగా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news