ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కు సంబంధించిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ ని అరెస్ట్ చేసే సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది.

దాన్ని పరిశీలించేందుకు సమయం కావాలని న్యాయస్థానం విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. పోలీసులు పీడీ యాక్ట్ పెట్టడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ రెండు నెలలుగా జైల్లోనే ఉన్నారు. మరోవైపు రాజా సింగ్ పై పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. తనపై నమోదు చేసిన పీడి యాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించింది.

Read more RELATED
Recommended to you

Latest news