హైదరాబాద్‌లో భారీ వర్షం.. గంట వ్యవధిలో 7 సెంటీమీటర్లకు పైగా

-

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తోంది వాన. దీంతో… రోడ్లపైకి వర్షపునీరు చేరింది. ఈ తరుణంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.గంట వ్యవధిలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయింది. హిమాయత్‌నగర్‌, శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, నాంపల్లిలో 6, ఉప్పల్‌, ఆసిఫ్‌నగర్‌, బాలానగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

కాగా, మరో 3 గంటల పాటు హైదరాబాదగ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ అంతటా దట్టంగా అలుముకున్నాయి మేఘాలు. అప్రమత్తంగ ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇక అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ తరుణంలో తెలంగాణ మరియు ఏపీ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version