తెలంగాణలో ఇవాళ, రేపు అతిభారీ వర్షాలు

-

తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. గురువారం నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

గురువారం రోజున కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో మంగళవారం రోజున పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

Read more RELATED
Recommended to you

Latest news