హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దు

-

హైదరాబాద్ మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఇప్పటివరకు వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ లో దంచి కొడుతోంది వర్షం. ఒక్కసారిగా మారిపోయింది వాతావరణం.

గత మూడు రోజులుగా భగ్గుమన్న బానుడు… ఒక్కసారిగా వాతావరణం చల్ల బడడం……జోరుగా వాన కురవడంతో నగర ప్రజలు చల్ల బడ్డారు. భారీ వర్షం తరుణంలో హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసుల సలహాలు ఇచ్చారు.

నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జాం అయిందని.. రెండు గంటల పాటు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచనలు చేశారు. భారీ వర్షం కారణంగా నగరంలో అన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లన్నీ జలమయం..అయ్యాయి. రాత్రి 9 గంటలవరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం వుందంటున్న ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్..ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news