తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దాదాపు 40 రోజుల తర్వాత ఏకధాటి వాన కురుస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర రైతులతో పాటు ప్రజలు కూడా సంబుర పడుతున్నారు.
అయితే…నిన్నటి వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం లో 12 cm, మనుగురు లో 10cm వర్ష పాతం నమోదు అయింది. ములుగు జిల్లా అలుబాక లో 8.8cm, కొత్తగూడెం జిల్లా అశ్వపురం లో 8.1cm, కామారెడ్డి లో 7.6cm, మెదక్ జిల్లా నాగాపూర్ 7.4cm, నిజామాబాద్ జిల్లా మొస్రా 7.2cm, నిర్మల్ లో 7.1 cm నమోదు అయింది.