ఏపీ రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. రేషన్ తీసుకోకుంటే ఎక్కడ కార్డు రద్దు చేయడం లేదని పౌరసరాఫరాల శాఖ వెల్లడించింది. దీనిపై ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మవద్దని సూచించింది.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని… ఏటా జూన్, డిసెంబర్ నెలలో అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తామంది. తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమంలో వచ్చిన దరకాస్తులను పరిశీలించి… అర్హులకు కార్డులు ఇస్తామని వెల్లడించింది.