కొద్దిరోజులుగా తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంటీరియర్ ఒడిశా, పరిసర ప్రాంతాలు, జార్ఖండ్ ప్రాంతాల్లో ఇంకా అల్పపీడనం కొనసాగుతుండడం.. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ద్రోణి కూడా ఉండడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్లగొండ, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొన్నా రు. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉద యం వరకు రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గూడూరు, వరంగల్ అర్బన్, రూర ల్ జిల్లాల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.