నెపోటిజం.. బాలయ్య పై నాగబాబు కామెంట్..!

-

నెపోటిజం.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రిని కుదిపేస్తున్న అంశం ఇది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాక దీనిపైన చర్చ జరుగుతుంది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ మరణంతో దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. దీని గురించి మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర హీరోల నుంచి యువ హీరోల దాకా అందరి గురించి ప్రస్తావించారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రిలోకి అడుగుపెట్టినా.. తర్వాత కాలంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని.. ప్రేక్షకాదరణ పొందారని నాగబాబు అన్నారు.

సపోర్ట్ ఉంటే సరిపోదని.. టాలెంట్ ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రానా, జూ. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి చాలా మంది హీరోలు తమ ఓన్ టాలెంట్‌తోనే హీరోలుగా నిలదొక్కుకున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రవితేజ, విజయ్ దేవరకొండ, కార్తీక్, నాని లాంటి యువ హీరోలు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రి లోకి వచ్చి నిలదొక్కుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news