ప‌దేళ్ల త‌ర్వాత‌… రాజ‌ధానిలో రికార్డు వ‌ర్ష‌పాతం..

-

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ నగ‌రంలో ఈ యేడాది వాన‌లు దంచికొట్టాయి. ముఖ్యంగా గ‌త నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో న‌గ‌రం అత‌లాకుత‌లం అయింది. ఆదివారం కూడా శేరిలింగంపల్లి, పటాన్‌చెరులో 6సెం.మీకి పైగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి తోడు ఉత్తర కర్ణాటక, రాయలసీమ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణుల ప్రభావం వల్ల మరో మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

కాగా హైదరాబాద్‌ మహా నగరంలో ఈ సారి కురిసిన వానలు పదేండ్ల రికార్డును బ్రేక్‌ చేశాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 2002లో హైదరాబాద్‌ నగరంలో 23 సెం.మీల వర్షపాతం నమోదవ్వడంతో హుస్సేన్‌సాగర్‌కు వరదలు వచ్చి పరిసర ప్రాంతాలన్నీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇక 2010లో 14సెం.మీల వర్షపాతం నమోదవ్వగా తాజాగా ఈ సంవత్సరం 9న నగరంలోని ఆసిఫ్‌నగర్‌ మండల పరిధిలో 15.1సెం.మీల అత్యధిక వర్షపాతం నమోదైంది. పదేండ్ల విరామం తరువాత ఇదే రికార్డు స్థాయి వర్షపాతంగా వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఈ సంవత్సరం నాలుగు నెలల్లో 45 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news