ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణనిచ్చారు.కౌంటింగ్ కోసం అధికారులు 50 పోలింగ్ కేంద్రాలకు 6టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలోనే ఫలితాలను ప్రకటించనున్నారు.మొదటి రౌండ్‌లో 600ఓట్లు, రెండోరౌండ్‌లో మిగిలిన 221ఓట్లను లెక్కించనుండటంతో గంటలోపే ఫలితం తేలనున్నది..అధికార పార్టీ విపక్షాలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరో వైపు టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత గెలుపు లాంఛమే అని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు..కవిత ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని కవిత అభిమానులు అశాభవంతో ఉన్నారు.