బ్రేకింగ్: హైదరాబాద్ లో హైఅలెర్ట్, అతి భారీ వర్షం మొదలు

-

హైదరాబాద్ లో భారీ వర్షం మళ్ళీ మొదలయింది. పట్ట పగలే హైదరబాద్ లో చీకటి వాతావరణం ఉంది. హైదరాబాద్ కు వాతావరణ శాఖా కీలక హెచ్చరికలు చేసింది. 30 నిమిషాల్లో భారీ వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరించిన కాసేపటికే భారీ వర్షం పడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కారు చీకట్లు అలముకున్నాయి. ఎల్బీ నగర్, మీర్ పేట, దిల్ షుక్ నగర్, ఉప్పల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది.

ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతుంది. హయత్ నగర్ లో అయితే ఆకాశానికి చిల్లు పడినట్టు పడుతుంది వర్షం. బయట ఉన్న వాళ్ళు వెంటనే ఇళ్ళకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. నగరం లో 53 పడవలను సిద్దం చేసారు. ఏపీ నుంచి 8 పడవలను తెలంగాణా సర్కార్ తెప్పించింది. ఇళ్ళ నుంచి ఎవరూ బయటకు రావొద్దు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news