బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టు విచారణ

-

బక్రీద్ సందర్భంగా జంతువధపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. యుగ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివకుమార్ లేఖను సుమోటో పిల్ గా స్వీకరించింది హైకోర్టు. మతపరమైన మనోభావాలు దెబ్బ తినేలా గోవధ జరుగుతోందని లేఖ రాశారు శివకుమార్. అయితే చర్యలు తీసుకోవాలని బక్రీద్ కు ఒక్క రోజు ముందు లేఖ రాయడం తగదని వ్యాఖ్యానించింది హైకోర్టు. సున్నితమైన అంశాల్లో చివరి నిమిషంలో వచ్చి హైకోర్టును లాగితే ఎలా..? అని ప్రశ్నించింది ధర్మాసనం.

ఈ నేపథ్యంలో గోవధ, అక్రమ రవాణా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు ఏజీ ప్రసాద్. చెక్ పోస్టులు పెట్టి కేసులు నమోదు చేస్తున్నామన్నారు ఏజీ. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం సీఎస్, డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలంది. నిజమైన స్ఫూర్తితో బక్రీద్ జరుపుకోవాలని కోరింది హైకోర్టు. ఆగస్టు 2న నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news