నెల్లూరులో టీడీపీ మైండ్‌గేమ్..వైసీపీ చెక్.!

-

అధికార వైసీపీని నిలువరించేందుకు ప్రతిపక్ష టి‌డి‌పి కూడా గట్టిగానే కష్టపడుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో టి‌డి‌పి నేతలకు బాగా తెలుసు. ఇంకా టి‌డి‌పి మనుగడ ప్రమాదంలో పడినట్లే. అందుకే ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. అలాగే వైసీపీకి ధీటుగా వ్యూహాలు కూడా వేస్తున్నారు. ఇక తమదైన శైలిలో మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీకి పట్టున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టి‌డి‌పి రాజకీయం మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలని టి‌డి‌పి వైపు తిప్పుకున్నారు. ఇటు నారా లోకేష్ పాదయాత్రతో టి‌డిపిలో జోష్ నెలకొంది. ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం దూకుడుగా ఉంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తున్నారు ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి తనదైన శైలిలో నెల్లూరులో వైసీపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాపై ఆనంకు గట్టి పట్టు ఉంది..అలాగే వైసీపీలో ఉన్న లొసగులు తెలుసు..దీంతో వైసీపీని ఇరుకున పెట్టేలా ముందుకెళుతున్నారు.

అటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం తమదైన శైలిలో వైసీపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంకా టి‌డి‌పిలో చేరే వైసీపీ నేతలు ఉన్నారని తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టి‌డి‌పిలో చేరతారని ప్రచారం చేస్తున్నారు.

కోటంరెడ్డి వైసీపీని వీడాక..నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్ గా ఆదాలని నియమించారు. నెక్స్ట్ ఆయనే అక్కడే పోటీ చేయవచ్చు. కానీ ఆయన పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఆదాల మాత్రం పార్టీ మారడం లేదని, ఇదంతా టి‌డి‌పి మైండ్ గేమ్ అని చెక్ పెట్టేశారు. అయితే గతంలో ఆదాల టి‌డి‌పిలోనే ఉన్నారు. 2019 నెల్లూరు రూరల్ అభ్యర్ధి ఈయనే. అయితే అప్పుడు చంద్రబాబు..కొన్ని కాంట్రాక్ట్ పనుల నిధులు ఇచ్చిన వెంటనే ఆదాల..వైసీపీలోకి జంప్ చేసి..ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ మారతారని ప్రచారం వస్తుంది. చూడాలి నెల్లూరులో ఇంకేం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news