కోదాడ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు హైకోర్టు షాక్..!

-

కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల నిర్వాహకులు ఫోర్జరీ పత్రాలతో అనుమతులు పొందారని.. దీనిపై తాను ఢిల్లీలోని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్, హైదరాబాద్ లోని జేఎన్టీయూ కి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని.. కోదాడకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు డాక్టర్ భట్టు శ్రీహరి రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ 8843/24 పై హై కోర్టు తీవ్రంగా స్పందించింది.

ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణలపై ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైదాబాద్ లోని జేఎన్ టీయూ, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నాలుగు వారాల లోపు తగిన చర్యలు తీసుకోవాలని.. అప్పటివరకు కళాశాలకు ఎలాంటి అనుమతులు పొడగించవద్దని కోర్టు ఆదేశించింది.  కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఇతరుల భూమిని తమ భూమిగా చూపడం.. ఆర్డీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ పొందిందని దీనిపై చర్యలు తీసుకోవాలని  జేఎన్టీయూకి  ఫిర్యాదు చేసినట్టు  తెలిపాడు భట్టు శ్రీహరి.

Read more RELATED
Recommended to you

Latest news