బీజేపీ ఎమ్మెల్యేల‌ సస్పెన్షన్ పై నేడు హై కోర్టు తీర్పు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌సంగం స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళ‌న చేస్తున్నార‌ని.. స్పీక‌ర్ సస్పెండ్ చేశారు. కాగ ఈ స‌స్పెన్షన్ స‌వాల్ చేస్తు.. బీజేపీ హై కోర్టులో కేసు వేసింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈట‌ల రాజేంద‌ర్, ర‌ఘునంద‌న్ రావు, రాజా సింగ్ ల‌ను సస్పెండ్ చేశారు. కాగ వీళ్లు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో.. గురువారం బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్ పై హై కోర్టులో వాదాన‌లు జ‌రిగాయి. కాగ ఈ పిటిషన్ పై నేడు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు వెల్ల‌డించ‌నుంది.

కాగ గురు వారం హై కోర్టు.. బీజేపీ ఎమ్మెల్యేల త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌కాష్ రెడ్డి, ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాదాల‌ను విన్న ధ‌ర్మాస‌నం. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2:15 గంట‌ల‌కు తీర్పు వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిపింది. కాగ త‌మ స‌స్పెన్షన్ గురించి అసెంబ్లీ నోటీసులు ఇచ్చేందుకు గురు వారం ప్ర‌య‌త్నించామ‌ని హై కోర్టుకు పిటిషన‌ర్లు, హై కోర్టు సిబ్బంది తెలిపారు. అయితే త‌మ ప్ర‌య‌త్నాలు అన్నీ కూడా విఫ‌లం అయ్యాయ‌ని తెలిపారు.

నోటీసు ఇచ్చేందుకు అసెంబ్లీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. త‌మ‌ను భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకున్నార‌ని తెలిపారు. అయితే నోటీసుల‌ను వాట్సప్ ద్వారా పంపించాల‌ని చూసినా.. ఆయ‌న ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంద‌ని హై కోర్టుకు తెలిపారు. కాగ వాద‌నలో.. ఎమ్మెల్యేలు స‌భ‌ను ఆటంక ప‌ర‌చ‌లేద‌ని తెలిపారు. కాగ అసెంబ్లీ నిర్వ‌హాణ విషయంలో కోర్టుల జోక్యం ఉండ‌ద్ద‌ని అడ్వ‌కెట్ జ‌న‌ర‌ల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news