ఈ మధ్య కాలం లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే కిడ్నీ సమస్యలు లేకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దానితో పాటు ఆహార విషయంలో కూడా మార్పులు చేస్తూ ఉండాలి.
హైడ్రేట్ గా ఉండడం, మంచి డైట్ లో తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు కూడా కలదు. సోడియం లేకుండా ఆహార పదార్థాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు మీ దరిచేరవు. అయితే మరి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది చూద్దాం.
క్యాబేజ్:
ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. విటమిన్ కె, సి, బి సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ మరియు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైటోకెమికల్స్, కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే సమస్యలు దూరం అవుతాయి.
ధనియాలు:
ఇవి కూడా కిడ్నీ ఫంక్షన్ కి బాగా హెల్ప్ అవుతాయి. ఒంట్లో ఉండే చెడు పదార్థాలను తొలగిస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీ దరి చేరకుండా కూడా ఉంటాయి.
క్రాన్ బెర్రీ:
క్రాన్ బెర్రీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది.
కాలీఫ్లవర్:
కాలీఫ్లవర్ కిడ్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాలీఫ్లవర్ లో 19 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. విటమిన్ సి, కె, బి ఇందులో ఎక్కువగా ఉంటాయి.