గ్రేట‌ర్ వార్ హీట్..‌ స‌వాళ్లు ప్ర‌తి స‌వాళ్ల‌తో మాట‌ల యుద్ధం

-

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో హీటెక్కుతున్నాయి. బీజేపీ నాయ‌కులు వ‌ర‌ద‌ల‌తో బుర‌ద రాజ‌కీయం చేశార‌ని టీఆర్ఎస్ నాయ‌కులు అంటున్నారు. న‌గ‌ర వాసుల‌కు ‌వ‌ర‌ద సాయం అంద‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ లేఖ రాశార‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సీఎం కేసీఆర్‌కు స‌వాల్ విసిరారు. తాను లేఖ రాసిన‌ట్లు నిరూపించాల‌ని డిమాండ్ చేశారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ పాత బ‌స్తీలోని బాగ్య‌‌‌ల‌క్ష్మి అమ్మ‌వారి గుడికి వ‌స్తే తాను లేఖ రాయ‌లేద‌ని ప్ర‌మాణం చేస్తాన‌ని స‌వాల్ విసిరారు. దీంతో శుక్ర‌వారం పాతబ‌స్తీలో ఒక్క‌సారిగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం హీటెక్కింది. పాత‌బ‌స్తీ ప‌రిస‌రాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు. అన్న‌ట్ల‌గానే బండి సంజ‌య్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పాత బ‌స్తీలోనే బాగ్యల‌క్ష్మి అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకొని పూజ‌లు చేశారు. సీఎం కేసీఆర్ రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌‌రం మీడియాతో మ‌ట్లాడారు.

నా సంత‌కం ఫోర్జ‌రీ చేశారు                                                                                                టీఆర్ఎస్ నాయ‌కులు వ‌ర‌ద‌ల‌పై బుర‌ద రాజ‌కీయం చేస్తున్నార‌ని అని అన్నారు. వ‌ర‌ద సాయం ఆపాల‌ని తాను ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లేఖ రాలేద‌ని చెప్పారు. లేఖ రాశాన‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని అన్నారు. త‌న సంతకాన్ని ఫోర్జ‌రీ చేశార‌ని, సీఎం కేసీఆర్ బీజేపీ త‌ప్ప‌డు ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధ క‌లిగించింద‌న్నారు. స‌ర్వేల‌న్నీ బీజేపీకే అనుకూలంగా ఉన్నాయ‌ని,, టీఆర్ ఎస్ పార్టీ త‌ప్ప‌డు ప్ర‌చారాలు చేసి ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని చూస్తుంద‌న్నారు. ప్ర‌భుత్వం వ‌ర‌ద సాయం రూ.550 కోట్లు విడుద‌ల చేసింద‌న్నారు… అందులో స‌గం ఆ పార్టీ నేత‌లే దోచుకున్నార‌ని మండిప‌డ్డారు.

బీజేపీని గెలిపిస్తే ఇంటింటికీ రూ.25,000 ప‌రిహారం
గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీకి మేయ‌ర్ పీఠం క‌ట్ట‌బెడితే ఇంటింటికీ రూ.25,000 వ‌ర‌ద‌సాయం అందిస్తామ‌న్నారు. అంతేకాకుండా జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేసి ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామ‌ని చెప్పారు. మాట త‌ప్ప‌మ‌న్నారు. టీఆర్ ఎస్ నాయ‌కుల‌కు ఎన్నిక‌ల‌ప్పుడే డ‌బుల్ బెడ్రూం ఇండ్లు గుర్తొకొస్తాయ‌న్నారు. ఎల్ఆర్ ఎస్ విష‌యం ఎందుకు మాట్లాడం లేద‌ని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి గెలువాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో భ‌గ‌వ‌ద్గీత‌, ఖురాన్ అన్న ముఖ్య‌మం‌త్రి వారి వెబ్‌సైట్ నుంచి ఎందుకు తొల‌గించారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.




Read more RELATED
Recommended to you

Latest news