మంత్రి సీతక్కకు హోంశాఖ!

-

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విస్తరణలో కొత్తగా ఐదారుగురికి చోటు దక్కొచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మంత్రుల సముదాయంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. మంత్రివర్గంలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి, రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరొకరికి అవకాశం ఉండొచ్చని తెలిపారు.

నిజామాబాద్‌ నుంచి ఒకరికి పదవి దక్కొచ్చని మంత్రి వెల్లడించారు. అయితే శాఖల్లో మార్పులు జరిగితే మంత్రి సీతక్కకు హోం శాఖ ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, దానం నాగేందర్‌కు మంత్రి పదవులు వచ్చే అవకాశముందని తెలిపారు. రాజగోపాల్‌ రెడ్డికి అధిష్ఠానం ఇప్పటికే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాల్లో మార్పులు ఉంటాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news