మండిపోతున్న చింతచిగురు ధర.. కిలో రూ.700

-

వేసవిలో స్పెషల్ చింత చిగురు వచ్చేసింది. మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన చింత చిగురును వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌తో పాటు రైతు బజార్లలో రైతులు రెండు, మూడు రోజులుగా విక్రయిస్తున్నారు. చింత చెట్ల ఆకులు రాలిపోయాక, వచ్చిన చిగురును వంటకాల్లో ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.

ఈ వేసవిలో చింత చిగురుతో చేసిన పప్పు, మాంసం వంటకాలను భోజన ప్రియులు చాలా ఇష్టంగా తింటారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్‌ రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.500- రూ.600 పలుకుతోంది. మెహిదీపట్నం రైతు బజార్‌లో శనివారం కిలో చింత చిగురు రూ.700 పలికింది. చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి, ప్రాణాలకు తెగించి సేకరిస్తామని అందుకే ధర ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. సెలవు దినాలు, ముఖ్యంగా ఆదివారం గిరాకీ ఎక్కువగా ఉంటుందని, బహిరంగ మార్కెట్లో 100 గ్రాములు రూ.100కు అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు. అయితే ధర ఎక్కువైనా సరే ఇది వేసవిలోనే దొరుకుతుంది కాబట్టి ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందేనంటూ వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news