హైదరాబాద్ నగరంలో వరుస గొలుసు చోరీలకు పాల్పడిన చైన్ స్నాచర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నగరంలో చోరీలకు పాల్పడింది యూపీ చైన్ స్నాచర్ గ్యాంగ్ అని గుర్తించారి. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే యూపీలో హైదరాబాద్, రాచకొండ పోలీసులు నిఘా ఉంచారు. శనివారం ఉదయం 7 చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు, మరో ఇద్దరు సహాయకులతో కలిసి అదే రోజు రాత్రి నగరం వదిలి పారిపోయారు.
నిందితులను తీసుకెళ్లిన ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాచిగూడ రైల్వేస్టేషన్ చేరాక దిల్లీ వెళ్లే రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిసి ఎంజీబీఎస్ వరకు తీసుకెళ్లినట్టు ఒక ఆటోడ్రైవర్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. సొంతూరు చేరితే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో చైన్ స్నాచర్లు దిల్లీలోనే ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయని ఉత్తరమండలం డీసీపీ చందనాదీప్తి తెలిపారు. తక్కువ సమయంలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.