బిల్డర్స్ కు హైదరాబాద్ స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నోవాటెల్ ల జరిగిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మా ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా ఎంవోయూ ఈ రోజు చేసుకున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది తొలి నెట్ జీరో సిటీ కాబోతుందని తెలిపారు. సబ్సీడీలు ఇ రియల్ ఎస్టెట్ రంగం మరింత విస్తరించేదంటున్నారని..అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. బిల్డర్స్ కు కావాలసిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.