రంజాన్ ఎఫెక్ట్.. ఖర్జూరాల విక్రయాల్లో హైదరాబాద్ నంబర్ వన్

-

రంజాన్‌ మాసంలో హైదరాబాద్ బేగంబజార్‌లో సందడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. రంజాన్ సమయంలో ఇక్కడి పండ్ల దూకాణాలకు ఉండే డిమాండ్ ఇంకెక్కడా ఉండదు. ఇక్కడి ఎండు పండ్లు, ఖర్జూరాల విక్రయ దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. ముస్లింలు ఉపవాసం అనంతరం ఖర్జూరాలతో పాటు డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటారు. హోల్‌సేల్‌గా విక్రయాలు చేస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల వాసులు బేగంబజార్‌కు వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ పలాస నుంచి వచ్చే ఖాజూ హోల్‌సేల్‌ ధరకే ఇస్తుండటంతో గిరాకీ పెరిగింది.

మరోవైపు దేశంలోనే ఎక్కువగా ఖర్జూరాలను వినియోగించే నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు ఉంది. ఏటా సుమారు 400 ట్రక్కుల ఖర్జూరాల విక్రయాలు ఇక్కడ జరుగుతండగా.. రంజాన్‌ నేపథ్యంలో ఆ విక్రయాలు ఇంకాస్త పెరిగాయి. ఖర్జూరాల్లో జహీదీ ఖర్జూరాలు కేజీ రూ.200 నుంచి రూ.400 ధర పలుకుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ఖర్జూరాల్లో రాజుగా పిలిచే అజ్వా రకం కేజీ రూ.2,000 ధర పలుకుతోంది. ఇందులో అత్యధిక ఔషధ గుణాలుండటంతో.. ఒక్కొక్కరూ ఐదు కిలోల పెట్టెలను కొనుగోలు చేస్తుంటారని వ్యాపారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news