నేపాలీ ముఠాల ఆట కట్టించిన హైదరాబాదీ పోలీసులు

-

భాగ్యనగరంలో కలకలం రేపుతున్న నేపాల్ దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల సికింద్రాబాద్‌ సింధి కాలనీలోని వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నేపాల్‌ ముఠాలోని 10 మందిని అరెస్టు చేశారు. ఈనెల 9వ తేదీన వ్యాపారి కుటుంబం ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోగానే ముఠాలోని ఐదుగురు వచ్చి  ఇంట్లోని బీరువాలు పగులగొట్టి నగదు, ఆభరణాలు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రాంగోపాల్‌పేట్‌ పోలీసులు ఈ నెల 11న కేసు దర్యాప్తు చేపట్టారు. డీసీపీ చందనాదీప్తి, ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు సారథ్యంలో ఐదు బృందాలను రంగంలోకి దింపారు. ఈ నెల 12న ముంబయిలో ఇద్దరిని అరెస్టు చేసినా వారి వద్ద సొమ్ము దొరకలేదు.

నిందితుల ఫొటోలను నగరపోలీసులు ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో పహారా కాసే సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) అధికారులకు పంపారు. రాచకొండ సీపీ డీఎస్‌చౌహాన్‌ ఎస్‌ఎస్‌బీ డీజీతో మాట్లాడి అప్రమత్తం చేశారు. ప్రధాన నిందితులు కమల్‌, పార్వతి, సునీల్‌చౌదరి పుణె నుంచి నేపాల్‌కు కారులో బయల్దేరి బర్సోలా, కక్రోలా సరిహద్దులో పట్టుబడ్డారు. 50 శాతం సొత్తు వారి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news