ఆ 3 జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ వార్నింగ్

-

తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురుస్తున్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్ర – ఒడిశాను ఆనుకుని అల్పపీడం ఏర్పడటం వల్ల ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఈ 3 జిల్లాల ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలు, చెట్లు కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదుకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-211 11111, 90001 13667కు ఫోన్‌ చేయాలని సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. నగర పరిస్థితులను GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news