ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటిస్థానం..

హైదరాబాద్.. తెలంగాణ రాజధాని నగరం. అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ దర్శనమిస్తారు. ఎవ్వరెక్కడి నుండి వచ్చినా ఒక్కసారి హైదరాబాద్ చేరుకుంటే తమ స్వంతం చేసుకుంటారు. ఇక్కడి ప్రజలు, వాతావరణం, అన్నీ గొప్పగానే ఉంటాయి. అందుకే ప్రముఖ టూరిస్ట్ వెబ్ సైట్ Holidify.com రూపొందించిన ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాల్లో హైదరాబాద్ కి మొదటి స్థానం వచ్చింది. మొత్తం 34నగరాల మీద జరిపిన అధ్యయనంలో హైదరాబాద్ మొదటి స్థానం దక్కించుకుంది.

ఈ సర్వేలో నగరంలోని ప్రజలు, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు, వాతావరణం, అక్కడి సౌలభ్యాలు అన్నీ పరిగణలోకి తీసుకున్నారట. హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ముంబై నిలవగా మూడవ స్థానంలో పుణె, నాలుగు.. చెన్నై, ఐదవ స్థానంలో బెంగళూరు నిలిచింది. వెబ్ సైట్ చెప్పిన దాని ప్రకారం హైదరాబాద్ ని సందర్శించడానికి సెప్టెంబరు నుండి మార్చి వరకు సరైన సమయం అని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం Holidify.com సర్వే వివరాలని బయటపెట్టింది.