హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుంది : కమిషనర్ రంగనాథ్

-

క్రేడాయ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం జులై 19 న జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్దతా ఉందా లేదా అని ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. హైడ్రా పై కొంత మంది న్యాయస్థానాలకు కూడా వెళ్లారు. హైడ్రా చట్ట బద్దమైనదే. ఎగ్జిక్యూటివ్ రెజల్యుషన్ ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎన్నో ఏర్పాటయ్యాయి. వచ్చే నెలలోపు హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుంది.

హైడ్రా చట్టబద్దత పై ప్రభుత్వం పని చేస్తుంది. కేబినెట్ ఆమోదంతోనే విశేష అధికారులతో హైడ్రా ఆర్డినెన్స్ వస్తుంది. వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషా అధికారులు హైడ్రాకు వస్తాయి. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం హైడ్రా బిల్లు తీసుకురాబోతుంది. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదు. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుంది. గ్రే హౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పని చేస్తుంది అని రంగనాథ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version