నేను ఎవరికీ హామీ చేయలేదు.. కంటతడి పెట్టిన తుల ఉమ..!

-

చివరి నిమిషంలో వేములవాడ అసెంబ్లీ టికెట్ ను బీజేపీ మార్చడంతో తుల ఉమా కంటతడి పెట్టారు. బీసీ మహిళకు బీజేపీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంట తడి పెట్టిన తుల ఉమ..నేను ఎవరికీ హామీ చేయలేదని.. తల్లిదండ్రులు నిబద్దతతో పెంచారు, అదే విధంగా పెరిగాను. బిసి బిడ్డ, మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారు. ప్రజలకు మేలు చేస్తే తెప్పు, ప్రజ నాయకురాలు ఎదగడం తప్పు..బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 పర్సంట్ రిజర్వేషన్ అన్నారు. కనీసం 10 శాతం, 12 శాతం కావడం లేదు. 75 ఏళ్లుగా దొరల ప్రాబల్యం నడుస్తుందని తెలిపారు.

ఇక వేములవాడ నుండే దొరల పై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. నన్ను నక్సలైట్ అంటున్నారు.ఆనాడు దొరల బానిసత్వం విముక్తి పై కోట్లాడిన వాస్తవమే, ఇప్పుడు కూడా ఇక కోట్లాడుత అన్నారు. నాకు ఇంకా నమ్మకం ఉంది. పార్టీ నాకు అవకాశం ఇవ్వక పోతే బిసి లకు, మహిళలకు ఇక బీజేపీ అవకాశాలు ఉండవు. నేను కచ్చితంగా పోటీలో ఉంటాను, కొట్లడుతాను. గోర్లు కాసుకునే వారు ఎమ్మెల్యే కవద్దా, వేములవాడ దొరల ప్రాంతం, వేరే వారికి అవకాశము ఇవ్వరా.. బీసీ బిడ్డగా నాకు అవకాశం కల్పించారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. అధిష్టానం బిసి ముఖ్యమంత్రి చేస్తారని ఇప్పటికే ప్రకటించింది
మహిళలకు 33% రిజర్వేషన్ కూడా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news