వరల్డ్ కప్ సెమీస్ రేస్ నుండి ఆ జట్టు కూడా అవుట్ !

-

నేడు అహమ్మదాబాద్ స్టేడియం లో జరుగుతున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్గనిస్తాన్ లు నామమాత్రం అయిన మ్యాచ్ లో తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో 244 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీనితో ఆఫ్ఘనిస్తాన్ డో ఆర్ డై మ్యాచ్ లో భారీ స్కోర్ చేయాల్సిన దశలో ఒక మోస్తరు స్కోర్ తో సరిపెట్టుకోవడంతో ఇందులో గెలిచినా న్యూజిలాండ్ రన్ రేట్ ను బీట్ చేయలేదు.. కనుక అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్ నుండి వైదొలిగింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో ఎనిమిది మ్యాచ్ లు అడ్డాగా సగానికి సగం మ్యాచ్ లను గెలుచుకుని అంచనాలను అందని రీతిలో ప్రదర్శన కనబరిచి పెద్ద టీం లాగా తయారయింది. ఇక గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా ను తన బౌలింగ్ తో వణికించిన తీరుకు ప్రపంచం మొత్తం ఫిదా అయిందని చెప్పాలి.

మాక్స్ వెల్ పొరపాటున నిలదొక్కుకుని ఆడేసి మ్యాచ్ ను గెలిపించాడు, లేకపోతే చాలా గర్వంగా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరేది. వెల్ డన్ ఆఫ్ఘన్.. అనేలా ప్రదర్శన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news