కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోల ఇష్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు నోటీసులపై రేవంత్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అసలు కాంగ్రెస్ అకౌంట్కు నాకు సంబంధమే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అమిత్ షా ఫేక్ వీడియో తాను షేర్ చేయలేదని ఢిల్లీ పోలీసులకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు.
ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్(@INCTelangana) ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టత ఇచ్చారు. రేవంత్ రెడ్డి కేవలం రెండు ట్విట్టర్ ఖాతాలను (సీఎంవో తెలంగాణ, తన వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు సమాధానం పంపాడు. ఇక నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి.. అమిత్ షాను కేసీఆర్ అవహించినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పోలీసులే కాదు.. సరిహద్దులోని సైనికులను తెచ్చుకున్న భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని వెల్లడించారు.