జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2014లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేది : సీఎం రేవంత్ రెడ్డి

-

జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. 2014లో కచ్చితంగా అధికారంలోకి వచ్చేది  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి అని గుర్తు చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం పాటు పడ్డారు. జైపాల్ రెడ్డి గారి రాజకీయం దేశవ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు.  కాంగ్రెస్ పార్టీ విధాన లోపం వల్లనే ఓడిపోయామని రాహుల్ గాంధీకి చెప్పినట్టు గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అన్ని తండాలు, గ్రామాల్లో బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు.

మాడ్గుల మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వేస్తామన్నారు. నేను చదివిన పాఠశాల కోట్రా తండా పాఠశాలకు రూ.5కోట్లు ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల కోసం రూ.180 కోట్లు కల్వకుర్తికి కేటాయిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి రాజధానికి 4 లైన్ల రోడ్లు వేస్తామని తెలిపారు.  ముచ్చర్ల వద్ద ఆగస్టు 01న స్కిల్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేయనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news