ఏపీలో జగన్మోహన్‌రెడ్డి పాలనను మెచ్చకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.అదేంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తప్పులు, దారుణాలపై జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఆయనపై ప్రధానమంత్రి పొగడ్తలు కురిపించడం ఏంటి…అనుకుంటున్నారా…అవును మీరు చదివింది నిజమే.ఏపీ మాజీసీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రధాని పొగడ్తలతో ముంచెత్తారు.ఇంతకీ జగన్‌ని ప్రధాని మోడీ ప్రశంసించింది ఎక్కడో తెలుసా… నీతి ఆయోగ్ సమావేశంలో.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అనే ఉద్దేశమే ప్రధాన అజెండాగా వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రధాని మోడీ జగన్‌ని ఓ స్కీమ్ విషయమై ప్రశంసించారు.భారత్ అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ పెట్టాలని ప్రధాని మోదీ సీఎంలను కోరారు.
తాగునీరు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ కేర్, విద్య,భూమి….ఈ ఐదు అంశాలపై అన్ని రాష్ట్రాలూ ఫోకస్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులకు సూచించారు.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్‌తో వచ్చాయనీ, మరికొన్ని రెడీ చేస్తున్నాయనీ, మొత్తంగా అన్ని రాష్ట్రాలూ దీన్ని అమలు చెయ్యాలని కోరారు.కాగా నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ.. 5 అంశాలను ప్రస్తావిస్తూ.. అందులో ఒకటైన హెల్త్ కేర్ గురించి మాట్లాడారు.హెల్త్ విషయంలో పలు రాష్ట్రాలు అమలుచేస్తున్న, చేసిన పథకాలను ప్రస్తావించారు.
వాటిలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను మోడీ మెచ్చుకున్నారు.వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇంలాటి పథకం వలన ప్రజలకు వైద్యం చేరువ అవుతుందనీ చెప్తూ అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు కావాలని ఆకాంక్షించారు మోడీ.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో భాగమైన జనసేన ప్రతిపాదించిన స్కిల్ సెన్సెస్‌పై కూడా నీతి ఆయోగ్ పాజిటివ్‌గా స్పందించింది. ఇప్పుడు యువతకు కావాల్సింది ఇదే అనే అభిప్రాయానికి వచ్చింది. ఈ క్రమంలో జనసేన ప్రతిపాదనకు మంచి మార్కులు పడినట్లైంది.ఇక ఉచిత పథకాలపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రజలకు మనీ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదన్న ప్రధాని మోదీ.. దాని బదులు గుడ్ గవర్నెన్స్ ఇస్తే, అది వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
జగన్మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే అందాయి.మధ్యవర్తుల సాయం లేకుండా మోసాలకు అవకాశం లేకుండా లబ్ధిదారులకు మేలు చేకూర్చిన ఘనత ఆయనది.వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు జగన్మోహన్‌రెడ్డి.వైద్యశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన తాను సీఎంగా ఉండగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మంచి మైలేజీ తీసుకువచ్చింది.
వాలంటీర్ల ద్వారా పెన్షన్‌లను నేరుగా గడప వద్దకే చేరవేసిన విధంగా వైద్యాన్ని కూడా ఇళ్ళ వద్దకే తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కింది.అప్పట్లో ఊరూరా నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లు జాతరను తలపించాయి.వైద్యం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వైద్యులను గ్రామాలకే తీసుకువచ్చి ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేసి మందులను అందించారు.ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోయినా ఈ పథకం మళ్ళీ అమల్లోకి వస్తే బాగుండని పల్లెజనాలు కోరుకుంటున్నారు.