వార్నీ ! రేవంత్ బీజేపీలో చేరాలంటే.. అక్కడ కాంగ్రెస్ ఓడల్సిందే ?

-

తెలంగాణ కాంగ్రెస్ ఉన్నా, లేనట్టుగానే ఉంటూ,  ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఏకాభిప్రాయం లేకపయినా, పైకి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం వైపు నడిపిస్తాము అంటూ, శపధాలు చేస్తూ, వస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరికంటే ఎక్కువగా ఆ పార్టీలో హడావుడి చేసే నేతల్లో మొదటి పేరు రేవంత్ రెడ్డి. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్లో లేకపోయినా, టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరినా, ఏదో రకంగా అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళల్లో రేవంత్ రెడ్డి ముందుంటారు. కాంగ్రెస్ తరఫున టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో సార్లు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. అయినా కేసీఆర్, కేటీఆర్ అవినీతిని ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ , టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
revanth-reddy
revanth-reddy
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆశించినంత స్థాయిలో మెరుగవ్వ లేదు. అయినా, ఉన్నంతలోనే నెట్టుకొస్తున్నారు. గత కొద్ది రోజులుగా బిజెపిలోకి వెళ్తున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే విధంగా కనబడడం లేదని, అందుకే బీజేపీ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఒకవైపు టీఆర్ఎస్ తో పాటు, బీజేపీ పైన విమర్శలు చేస్తూనే వస్తుండడంతో అందులోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయడమే ఏకైక లక్ష్యంతో ఉన్న రేవంత్ కాంగ్రెస్ తో పని అయ్యేలా లేకపోతే బిజెపీలో అయినా చేరి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో రహస్యంగా మంతనాలు చేసినట్లు, ప్రచారం జరుగుతోంది. ఇద్ఇలా ఉంటే ప్రస్తుతం దుబ్బాక లో జరగబోతున్న  ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతం కంటే మెరుగ్గా లేదనే విధంగా ఓట్లు వచ్చినా, ఇక కాంగ్రెస్ లో ఉండేందుకు రేవంత్ సిద్ధంగా లేరట.
ఈ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఆయన బిజెపిలో చేరికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చే ఫలితాన్ని బట్టిి, రేవంత్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ సభ్యుడు చెరుకు శ్రీనివాసరెడ్డిని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న రేవంత్, అదేపనిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ,  తెలంగాణ రాజకీయాలను వేడెక్కించే పనిలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news