మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని రాజకీయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని ఫైర్ అయ్యారు. ఇంకోసారి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే నాలుక కోస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. గాంధీ భవన్లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా సీఎం కాదు ముందు మీ బావ (హరీష్ రావు) బీజేపీలోకి పోకుండా చూసుకోమని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మా చెల్లిని అరెస్ట్ చేయొద్దని ఢిల్లీ వెళ్లి వాళ్ళ కాళ్ళు మొక్కి వచ్చింది నువ్వని విమర్శించారు. బావ, బామర్థులు ఢిల్లీ వెళ్లి బీజేపీతో మంతనాలు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. చెల్లిని అరెస్ట్ చేయద్దని చెప్తే అవినీతికి పాల్పడ్డారని మిమ్మల్ని మోదీ పట్టించు కోలేదన్నారు.
కేటీఆర్ కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. తెలంగాణా రాగానే రాష్ట్రాన్ని దోచుకొనికి నిన్ను మీ నాన్న కేసీఆర్ అమెరికా నుండి రప్పించి మంత్రిని చేశాడని అన్నారు. అన్నీ అవినీతి పనులు బయట పడుతాయని ఇష్టమునట్లు మాట్లాడుతున్నారు.. మీ అవినీతి సొమ్మంతా కక్కించే వరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఊరుకోవని హెచ్చరించారు. మీరు పడేండ్లుగా ఎంత దోచుకున్నారో విచారణ జరుగుతుందని.. ఎన్నికలు అయిపోగానే కేటీఆర్, కేసీఆర్, హరీష్, రావు అందరు జైలుకి పోవడం ఖాయమన్నారు. పదేళ్ల పాటు దుర్మార్గమైన పనులు చేసిన మీకు శిక్ష తప్పదని హెచర్చించారు.