చంద్రబాబు, లోకేష్ కి కొడాలి నాని సవాల్..!

-

చంద్రబాబు, లోకేష్ లకు కొడాలి నాని సవాల్ విసిరారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడలో ఐదోసారి తాను గెలవబోతున్నానని తెలిపారు. ఎన్నికల ముందు నన్ను ఓడిచేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారు. ఎంత మంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతాను. గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్ కి ఇదే నా సవాల్ అంటూ చంద్రబాబు, లోకేష్ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలన్నారు.


టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది. నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని.. పూటకో వ్యక్తిని తెచ్చే బ్రతుకులు టీడీపీవి.  ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చినవాడిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు
‘చంద్రబాబు ఎంత 420 వ్యక్తి అనేది చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు.  చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు అన్నారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్ సీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news